Thursday, May 2, 2024

కాటమయ్య బొన మెత్తిన – మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాటమయ్య బోన మెత్తారు. మహిళలతో కలిసి భక్తుల హర్షధ్వానాల మధ్య కాటమయ్య గుడి చుట్టూ తిరిగారు. మంత్రి జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. దేవరుప్పుల, కొడకండ్ల, పెద్ద వంగర, తొర్రూరు, రాయపర్తి తదితర మండలాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెద్ద వంగర మండలం చిట్యాల సురమాంబ శ్రీ కంఠ మహేశ్వర స్వామి దేవాలయంలో బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరైన మంత్రి మహిళలతో కలిసి బోనం ఎత్తారు. ప్రజలు హర్షధ్వానాలు చేశారు. అనంతరం ప్రజలతో కలిసి కాటమయ్యను దర్శించుకున్నారు. గ్రామస్థులకు శుభాకాంక్షలు తెలిపారు. మోత్యా తండాలో.. దుర్గమ్మ పండుగ ఉత్సవాలలో మంత్రి పాల్గొన్నారు. గుడిని సందర్శించారు. తండా వాసులకు శుభాకాంక్షలు తెలిపారు.

లక్ష్మణ్ తండాలో దుర్గమ్మ పండుగ
మండలంలోని లక్ష్మణ్ తండాలో జరిగిన దుర్గమ్మ పండుగ కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గ్రామంలోని దుర్గమ్మ ఆలయాన్ని తండా వాసులతో కలిసి సందర్శించారు. అమ్మ వారికి మొక్కుకున్నారు. గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధిపై చర్చించారు. దేవరుప్పుల కు చెందిన నీలారపు పెద్ద వెంకన్న కు cmrf చెక్కును పంపిణీ చేశారు.

పరామర్శలు
దేవరుప్పుల లో నిన్న మరణించిన కర్ర కొమురయ్య కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. తన సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై కోలుకుంటున్న యాదగిరి గౌడ్ ని మంత్రి పరామర్శించారు.

రామేశ్వరం, పలుగుల తండాలో దుర్గమ్మ పండుగ
కొడకండ్ల మండలం రామేశ్వరం, పలుగుల తండాలో దుర్గమ్మ పండుగ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. తండాలో దుర్గమ్మ గుడిని మంత్రి సందర్శించారు. గుడిలో అమ్మ వారికి మొక్కుకున్నారు. సర్పంచ్ ఇంటికి వెళ్ళి కొద్దిసేపు ఉన్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు, సమస్యల మీద తండా వాసులతో చర్చించారు. ఆయా కార్యక్రమాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement