Saturday, April 27, 2024

అనుకున్న తేదీ కంటే ముందే కార్తి సినిమా.. ఆగ‌స్ట్ 12న రిలీజ్ కానున్న‌ విరుమన్..!

త‌మిళ స్టార్ కార్తికి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. కార్తి నటించిన సిన‌మాల‌న్నీ త‌మిళంతో పాటు తెలుగులో కూడా ఏకకాలంలో రిలీజ్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇంట‌ర్వూలు గాని, స్పిచ్‌లలో గాని తెలుగులోనే మాట్లాడ‌టంతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌లో మ‌రింత అభిమానం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం కార్తి చేతిలో ఐదు సినిమాల‌న్నాయి. అందులో ‘విరుమ‌న్’ ఒక‌టి. ముత్త‌య్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీలో ప్రముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ కూతురు అధితి హీరోయిన్‌గా న‌టించింది. యాక్ష‌న్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాని వినాయ‌క చ‌తుర్థి సంద‌ర్భంగా ఆగ‌స్టు 31న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. అయితే అదే నెల‌లో విక్రమ్ ‘కోబ్రా’.. విశాల్ ‘లాఠీ’ ఉండటంతో, ‘విరుమన్’ను దీపావళికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కొన్ని కారణాల వలన విక్రమ్.. విశాల్ సినిమాలు పక్కకి తప్పుకున్నాయి. పోటీకి దగ్గర్లో పెద్ద సినిమాలు కూడా లేవు. దాంతో హఠాత్తుగా కార్తి సినిమా రంగం మీదికి వచ్చేసింది. వ‌చ్చే నెల ఆగ‌స్ట్ 12వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్ల‌డించారు మేక‌ర్స్.

ఈ మూవీని 2డీ ఎంట‌ర్టైన‌మెంట్స్ ప‌తాకంపై సూర్య, జ్యోతిక నిర్మించారు. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జర‌పుకుంటుంది. కాగా ఇప్పుడు కార్తి, పీ.ఎస్ మిత్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ‘స‌ర్దార్’ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ సినిమాపై కూడా ప్రేక్ష‌కుల‌లో మంచి అంచ‌నాలే నెల‌కొన్నాయి. వీటీతో పాటుగా మ‌ణిర‌త్నం డైరెక్ష‌న్ లో ‘పొన్నీయున్ సెల్వ‌న్’ లో నటిస్తున్నాడు. ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మొద‌టి భాగం సెప్టెంబ‌ర్ 30న విడుద‌ల కానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement