Monday, May 6, 2024

కంగనా దేశ ద్రోహి.. పెరుగుతున్న విమర్శలు..

హైదరాబాద్‌, (ప్ర‌భ‌న్యూస్): పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న అనంతరం ప్రముఖ సినీనటి కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దేశానికి 1947లో వచ్చిన స్వాతంత్య్రం అభూత కల్పన మాత్రమేనని, 2014లో మోడి ప్రధాని పగ్గాలు చేపట్టడం తోనే భారత్‌కు నిజమైన స్వాతంత్య్రమొచ్చిందంటూ కంగన చేసిన వ్యాఖ్యల్ని కొందరు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఆమెపై దేశ ద్రోహ కేసు పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాల్లో ప్రభుత్వం ఉపేక్షించడాన్ని విమర్శిస్తున్నారు. కంగనను కఠినంగా శిక్షించాల్సిందేనని వాదిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగు తోంది. తాజాగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు.

కంగనకు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కంగన వ్యాఖ్యలకు మద్దతు కూడా పెరుగుతోంది. ముఖ్యంగా బీజేపీ, సంఘ్‌పరివార్‌ల నుంచి కంగన వ్యాఖ్యలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. భారత స్వాతంత్య్ర సంగ్రామం దీర్ఘకాలం సాగింది. ఇందులో అనేక మలుపులు, కీలక ఘట్టాలున్నాయి. సిపాయిల తిరుగుబాటు నుంచి పలు ప్రధాన సంఘటనలు చోటు చేసుకున్నాయి. సుభాష్‌ చంద్రబోస్‌ వంటి నాయకులు తుపాకీ ద్వారానే స్వాతంత్య్ర సాధనకు ప్రయత్నించారు. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూలు సామరస్య వాతావరణంలో స్వాతంత్య్రం సాధించాలని అభిలషించారు. ఎట్టకేలకు గాంధీ బృంద ఆలోచనే ఆచరణాత్మకమైంది. అయితే 1947లో భారత్‌కు స్వాతంత్య్రం లభించినప్పటికీ వాస్తవానికిది నిజమైన స్వాతంత్య్రమేనా అన్న సందేహాలు, చర్చలు ఇప్పటికీ పెద్దెత్తున కొనసాగుతూనే ఉన్నాయి.

దీనిపై పలురకాల విశ్లేషణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. దేశం నుంచి వైదొలగాలని నిర్ణయించిన బ్రిటీష్‌ పాలకులు ఇంటి పెద్ద తరహాలో వ్యవహరించారు. హిందువులు, ముస్లింలకు వేర్వేరు దేశాల్ని విడదీశారు. శాంతియుతంగా జీవించమని ఉద్బోధించారు. ఇదంతా ఓ పెద్దన్న తరహాలోనే జరిగింది. ఎక్కడా శత్రువుల్ని తిప్పికొట్టి భారత భూభాగాన్ని స్వాతంత్య్ర సంగ్రామయోధులు సాధించుకున్న రీతిలో జరగలేదు. దేశ విభజన ప్రక్రియ కూడా బ్రిటీషీయులు పథకం ప్రకారం నిర్వహించారు. అందుకే అప్పటి నుంచి శాంతియుతంగా పొందిన స్వాతంత్య్రం సత్ఫలితాలు ఇవ్వదన్న వాదన కొనసాగుతూనే ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement