Wednesday, May 1, 2024

యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోన్న.. క‌బ్జా ట్రైల‌ర్

క‌న్న‌డ స్టార్ హీరో ఉపేంద్ర ప‌లు తెలుగు చిత్రాల్లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌ర‌య్యాడు. కాగా ఉపేంద్ర‌..కిచ్చా సుదీప్ క‌లిసి న‌టిస్తోన్న మూవీ క‌బ్జా. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా నటిస్తుండటం మరో విశేషం.. ఈ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. స్వతంత్రం రావడానికి ముందు 1945లో జరిగిన కథగా ఈ చిత్రాన్ని మలిచారు. విజువల్స్ అన్నీ కేజీఎఫ్ సినిమా తరహాలో ఉన్నాయి. డార్క్ థీమ్.. మ్యూజిక్.. యాక్షన్స్ సీన్స్.. డైలాగ్స్.. ఎలివేషన్స్.. మరో కేజీఎఫ్ ను గుర్తు చేస్తున్నాయి. చరిత్ర ఎప్పుడూ తెగిపడిన తలల కంటే.. ఆ తలల్ని తీసిన చేతులనే పొగుడుతుంది. అలాంటి ఒక చేయి సృష్టించిన కథే కబ్జా ..ఓ సామ్రాజ్య నిర్మాణం.. నరికే కత్తితో కాదు. ఆ కత్తిని పట్టిన బలమైన చేతితోనే సాధ్యం .. వంటి డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నాయి. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీని ఆర్.చంద్రు తెరకెక్కించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement