Friday, May 3, 2024

విద్యార్థులకు జేఎన్‌యూ వార్నింగ్‌.. అశాంతి కలిగించొద్దని హెచ్చరిక

ఢిల్లీలోని జేఎన్‌యూ వర్సిటీలో రెండు స్టూడెంట్స్‌ యూనియన్ల మధ్య తలెత్తిన ఘర్షణపై రిజిస్ట్రార్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు ఎలాంటి అల్లర్లకు, విధ్వంసాలకు దిగొద్దని లేఖలో వార్నింగ్‌ ఇచ్చారు. వర్సిటీలో శాంతికి భంగం కలిగితే సహించబోమని హెచ్చరించారు. క్యాంపస్‌లో హింసను ఎట్టిపరిస్థితుల్లో సహించేదిలేదని వీసీ చెప్పారని ఆ లేఖలో రిజిస్ట్రార్‌ తెలిపారు. యూనివర్సిటీలోని ఏబీవీపీ, జేఎన్‌యూఎస్‌యూ సంఘాల విద్యార్థుల మధ్య ఆదివారం ఘర్షణ జరిగింది.

తామేమీ నాన్‌ వెజ్‌ ఫుడ్‌కు వ్యతిరేకం కాదు అని, హాస్టల్‌ల ఏదైనా తినవచ్చు అని, కానీ శ్రీరామనవమి పూజను నిర్వహిస్తున్న కార్యకర్తలను అడ్డుకోవడం సరికాదు అని జేఎన్‌యూ ఏబీవీపీ అధ్యక్షుడు రోహిత్‌ యాదవ్‌ తెలిపారు. జేఎన్‌యూఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, డీఎస్‌ఎఫ్‌, ఏఐఎస్‌ఏ సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని ఏబీవీపీ విద్యార్తులపై కేసు నమోదుచేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement