Thursday, May 2, 2024

గణేశ్ చతుర్థి నుంచి జియో ఎయిర్ ఫైబర్ సేవలు.. ఏఐపై కీలక ప్రకటన

జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ రంగంలోకి అడుగుపెట్టనున్నట్లు రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత‌ ముకేశ్ అంబానీ ప్రకటించారు. గ్లోబల్ ప్లేయర్‌లతో జట్టుకట్టి డిజిటల్ ఇంటర్‌ఫేస్ ద్వారా సులభమైన, ఇంకా స్మార్ట్, లైఫ్, జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్టులను అందించడానికి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగంలోకి ప్రవేశిస్తుందని పేర్కొన్నారు. కస్టమర్ అవసరాలను నిజంగా ప్రత్యేకమైన రీతిలో తీర్చడానికి ప్రిడిక్టివ్ డేటా అనలిటిక్స్‌ని ఉపయోగించనున్నట్లు తెలిపారు.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై కీలక ప్రకటన

ప్రపంచ ఏఐ విప్లవం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పునర్నిర్మిస్తోందని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. జియో ప్లాట్‌ఫారమ్‌ల డొమైన్‌ల అంతటా భారతదేశ నిర్దిష్ట ఏఐ మోడల్‌లు, ఏఐ ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో ముందుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తద్వారా భారతీయులు, వ్యాపారాలు, ప్రభుత్వానికి ఏఐ ప్రయోజనాన్ని అందజేయాలి అనుకుంటున్నట్లు చెప్పారు.

- Advertisement -

గణేశ్ చతుర్థి నుంచి జియో ఎయిర్ ఫైబర్ సేవలు..

సెప్టెంబర్ 19న గణేశ్ చతుర్థిని పురస్కరించుని రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ సేవలు ప్రారంభించనున్నట్లు ముకేశ్ అంబానీ ప్రకటించారు. వైర్ లెస్ 5జీ ఇంటర్నెట్ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. జియో ఎయిర్ ఫైబర్ డివైస్ ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ అందరికీ చేరుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement