Monday, June 24, 2024

TS | వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటాం.. పలు సంఘాల ఏకగ్రీవ తీర్మానం

కరీంనగర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రాజకీయాలకు అతీతంగా అన్నివర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. అభివృద్ధి, సంక్షేమంలో నియోజకవర్గ రూపు రేఖలు మారుస్తున్న గంగుల కమలాకర్ కు అండగా ఉంటామని తీర్మానాలు చేస్తున్నారు. సోమవారం మీ సేవా కార్యాలయంలో రైస్ మిల్లు అసోసియేషన్.. ముదిరాజ్ కులస్తులు..డీటీఫ్ ఉపాధ్యాయ సంఘం . విశ్వబ్రాహ్మణ కార్పెంటర్ అసోసియేషన్.. మంత్రి గంగులను కలిసి సంఘీభావం ప్రకటించారు..

ఈ సందర్బంగా వచ్చే ఎన్నికల్లోకరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ కి పూర్తి మద్దతుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. తమ ఓట్లన్నీ మూకుమ్మడిగా గంగులకే వేస్తామని ప్రమాణ పూర్వకంగా తీర్మానం చేశారు. కేసీఆర్ పాలనలోనే తమకు అన్ని విధాలా న్యాయం జరిగిందని, గంగుల నాయకత్వం లోనే కరీంనగర్ నియోజకవర్గం ప్రగతిపథంలో పయనిస్తోందని వెల్లడించారు. ఉద్యమపార్టీకి, ఉద్యమ నేతకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి రాజిరెడ్డి, ఏం రఘు శంకర్ రెడ్డి, ఏసు రెడ్డి, ఉమారాణి, తిరుపతి, ఈ దామోదర్, పీ నరసయ్య, వెంకటేశ్వర్ రెడ్డి, ప్రభాకర్, రామకృష్ణ, అరుణాదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement