Wednesday, May 22, 2024

Jharkhand సీఎం హేమంత్ సోరేన్ రాజీనామా.. కొత్త ముఖ్యమంత్రిగా చంపై సోరేన్ !

జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్‌ నియామకం కానున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ రాజీనామా చేయ‌డంతో చంపై సోరెన్‌ను సీఎంగా ఎన్నుకున్నారు. చంపై సోరెన్‌.. హేమంత్‌ సోరెన్‌కు దగ్గరి బంధువని సమాచారం. ప్రస్తుతం ఆయన కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జేఎంఎంతో పాటు కాంగ్రెస్‌ సైతం మిత్రపక్షంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా హేమంత్‌ సోరెన్‌ భార్య కల్పనా సోరెన్‌ బాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం జరిగింది. ఎవరూ ఊహించని విధంగా చంపై సోరెన్‌ పేరు తెరపైకి వచ్చింది.

ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి హేమంత్ సోరెన్ భూకుంభకోణంలో ఇరుక్కున్నారు. ఈ కుంభకోణంపై ఈడీ దర్యాప్తు చేస్తుంది. పలుసార్లు ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేయగా.. విచారణకు గైర్హాజరయ్యారు. ఇంతకు ముందు ఒకసారి విచారించింది. మళ్లీ ఇవ్వాల (బుధవారం) సైతం ఈడీ అధికారులు ఆయన నివాసానికి చేరుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. అరెస్టు చేసే అవకాశం ఉండడంతో జార్ఖండ్‌ సీఎం పదవికి హేమంత్‌ సోరెన్‌ రాజీనామా చేశారు. ఈ క్రమంలో జార్ఖండ్‌ ముక్తి మోర్చా (JMM), కాంగ్రెస్ కూటమి శాసనసభా పక్ష నేతగా చంపై సోరెన్‌ను ఎన్నుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement