Friday, May 17, 2024

Land Scam – జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాంచీలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు తన రాజీనామాను సమర్పించిన నిమిషాల తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది.అంతకుముందు బుధవారం సాయంత్రం, భూ కుంభకోణంలో ఏడు గంటలకు పైగా ఈడీ ప్రశ్నించడంతో హేమంత్ జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. బుధవారం నాడు ఈడీ విచారణ ముగిసిన కొద్ది క్షణాలకే హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. జార్ఖండ్‌లో భూకుంభకోణం విచారణలో భాగంగా సోరెన్‌ను ప్రశ్నించినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది.

జార్ఖండ్ మంత్రి, అధికార సంకీర్ణ ముఖ్యమంత్రిగా ఎంపికైన చంపై సోరెన్ 43 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను గవర్నర్‌కు సమర్పించారు. జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రి చంపై సోరెన్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement