Monday, April 29, 2024

జార్ఖండ్ కి గట్టి పోటి ఇచ్చిన హైద‌రాబాద్.. 36 పరుగుల‌ తేడాతో ఓట‌మి…

ఎలైట్‌ గ్రూప్‌-సీలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌పై జార్ఖండ్‌ 36పరుగులు తేడాతో గెలిచింది. చండీగఢ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన జార్ఖండ్‌ నిర్ణీత 50ఓవర్లలో 276పరుగులు చేసి ఆలౌటైంది. విరాట్‌సింగ్‌ 59బంతుల్లో 6ఫోర్లు, 2సిక్స్‌ల సాయంతో 65పరుగులు చేసి హాఫ్‌సెంచరీ సాధించి టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. హైదరాబాద్‌ బౌలర్లో మిలింద్‌ 63పరుగులిచ్చి 6వికెట్లు తీయడం విశేషం. అనంతరం 277పరుగుల లక్ష్య ఛేదనలో హైదరాబాద్‌ 48.4ఓవర్లలో 240పరుగులు చేసి ఆలౌటైంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement