Sunday, May 5, 2024

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు శిక్ష..

మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరికీ జైలు శిక్ష విధిస్తూ పెద్దపల్లి జూనియర్ సివిల్ జడ్జి రాణి తీర్పునిచ్చారు. శనివారం పట్టణంలో వాహనాల తనిఖీల్లో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని పెద్దపెల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ కోర్టులో హాజరు పరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి జైలు శిక్ష విధించారు.

పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రామానికి చెందిన అరికెళ్ల నవీన్ కు మొదటిసారి మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో రెండు రోజులు, రెండవసారి మద్యం తాగి వాహనం నడిపిన కేసులో నాలుగు రోజుల జైలు శిక్ష విధించారు. మూలసాల కు చెందిన రాయిని సతీష్ మద్యం సేవించి వాహనం నడిపిగా క రెండు రోజులు జైలు శిక్ష విధించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, మద్యం సేవించి వాహనాలు నడిపే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement