Tuesday, May 21, 2024

ప‌న‌స‌పండుకోసం – తిప్ప‌లు ప‌డిన ఏనుగు-వైర‌ల్ గా వీడియో

రుచులు అనేవి కేవ‌లం మ‌నిషికేనా ..మూగ‌జీవాల‌కి కూడా ఉంటుంది. అందుకే ఓ ఏనుగు ప‌న‌స‌పండుని తినేందుకు ప‌డిన తిప్ప‌లు అన్నీ ఇన్నీ కావు. వివ‌రాల్లోకి వెళ్తే..ఓ ఏనుగుకి పనస చెట్టు క‌నిపించింది. ఆ చెట్టుకి నోరూరించే పనస పళ్లు ఉన్నాయి. అంతే ఎవరికైనా ఆ పళ్లను చూస్తే తినాలని అనిపిస్తుంది కదా. ఏనుగుకి కూడా అంతే.. వాటిని చూడగానే తినాలి అనిపించింది. కానీ ఆ చెట్టుకి కాయలు కిందకు లేవు… ఎక్కడో పైన కొమ్మకి ఉన్నాయి. వాటిని అందుకోవడం ఆ ఏనుగుకు కాస్త కష్టమే. కానీ.. వాటిని వదిలేయడం వాటికి ఇష్టం లేదు. అందుకే.. చెట్టుపైకి రెండు కాళ్లు ఎత్తి మరీ.. చెట్టు మీద ఉన్న పనస పళ్లను తన తొండంతో కోసింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియ‌దు కానీ .. దీనికి సంబంధించిన వీడియో మాత్రం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement