Friday, April 26, 2024

నా జీవితంలోని మరో దశలోకి ప్రవేశిస్తున్నా.. మంచు మ‌నోజ్ ట్వీట్

హీరో మంచు మ‌నోజ్ చేసిన ట్వీట్ ప‌లు అనుమానాల‌ను రేకెత్తిస్తోంది. విష‌యం ఏంటంటే. ఈ విషయం చాలా రోజులుగా నా మనసులోనే దాచుకున్నాను.. నా జీవితంలోని మరో దశలోకి ప్రవేశించడానికి సంతోషిస్తున్నాను.. అదేంటో 20 జనవరి 2023న ప్రకటిస్తాను.. నాకు ఎప్పటిలాగే మీ అందరి ఆశీస్సులు కావాలి”.. అంటూ ట్వీట్ చేశారు మనోజ్. దీంతో మనోజ్ తదుపరి ప్రాజెక్ట్ గురించి చెప్పుతున్నారా .. లేదా సెకండ్ మ్యారెజ్ అనౌన్స్ చేయబోతున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అసలు విషయం ఏంటీ అనేది తెలియాలి అంటే జనవరి 20 వరకు ఆగాల్సిందే.మంచు మనోజ్ సినిమాల విషయాన్ని పక్కన పెడితే కొద్దిరోజులుగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. 2015లో ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్న మనోజ్.. ఆ తర్వాత 2019లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి మనోజ్ ఒంటరిగానే ఉంటున్నారు. అయితే కొద్ది రోజులుగా మనోజ్ రెండో పెళ్లి వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇటీవల రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి రెండో కూతురు భూమా మౌనికతో కలిసి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు వినిపించాయి. కానీ తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై సున్నితంగా స్పందించారు. దీంతో వీరి పెళ్లి నిజమనే టాక్ నడిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement