Thursday, April 25, 2024

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్ : శ్రీధర్ వర్మ

తిరుపతి : పేద బడుగుల ఆశాజ్యోతి ఎన్టీఆర్ అని రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ తెలిపారు. బుధవారం స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద 27వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. అందులో ప్రధానంగా సిమ్స్, బర్డ్స్ హాస్పిటల్, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఒక్క రూపాయి కిలో బియ్యాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించడం జరిగిందని తెలియజేశారు. జాతీయ రాజకీయాలకు సరికొత్త దిశా నిర్దేశం చేశారని, సంక్షేమ పథకాలతో సమ సమాజ స్థాపన ఎన్టీఆర్ బాటలు వేశారన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు మనమందరం నడుంబిగిద్దామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులు నరసింహ యాదవ్, నియోజకవర్గ ఇన్ చార్జి సుగుణమ్మ, నగర అధ్యక్షులు చిన్నబాబు, కార్యదర్శి మహేష్ యాదవ్, బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఊ కా.విజయ కుమార్ రాష్ట్ర కార్యదర్శిలు సురాసుధాకర్ రెడ్డి. బుల్లెట్ రమణ, ఊట్ల సురేందర్ నాయుడు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement