Sunday, May 19, 2024

తెలంగాణను కాపాడే బాధ్యత నాది.. సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత నాదని సీఎం కేసీఆర్ అన్నారు. కొంగరకలాన్ లో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ను ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడుతూ… మనం నిద్రపోతే పెద్ద ప్రమాదానికి లోనవుతామన్నారు. పంటల తెలంగాణ కావాలా ? మంటల తెలంగాణ కావాలా అని ప్రశ్నించారు. స్వతంత్ర భారతంలో హైదరాబాద్ స్టేట్ గా ఉండేవాళ్లమన్నారు. తర్వాత మనం ఆంధ్రప్రదేశ్ లో భాగమయ్యామన్నారు. తొలిదశ ఉద్యమంలో 400మంది విద్యార్థులు చనిపోయారన్నారు. తర్వాత మళ్లీ తెలంగాణ ఉద్యమం చేయాల్సి వచ్చిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement