Sunday, May 19, 2024

పంద్రాగస్టుకు ముందే గగన్‌యాన్‌..

ఈ సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవానికి ముందే గగన్‌యాన్‌ ప్రాజెక్టును కార్యరూపంలోకి తీసుకొస్తామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రకటించింది. ఈ మిషన్‌ కింద ప్రణాళికా బద్ధమైన రెండు మానవ రహిత విమానాలను ప్రయోగించబోతున్నట్లు ఇస్రో చైర్మన్‌ శివన్‌ మంగళవారం మీడియాకు వివరించారు. ఇందులో మొదటిది పంద్రాగస్టులోపునే నింగికి పంపుతామని, వచ్చే ఏడాది మధ్యలో రెండవదైన చంద్రయాన్ – 3ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ ఏడాది మా ముందు కీలక ప్రాజెక్టులు, లక్ష్యాలు ఉన్నాయి. వీటిలో కొన్ని పీఎస్‌ఎల్‌వీ ఈవోఎస్‌-4, ఈవోస్‌ -6 ప్రయోగాలు. ఎస్‌ఎస్‌ఎల్‌వీ తొలి విమానంలో ఈవోఎస్‌-02 ప్రయోగం ముఖ్యమైనది. దీనికితోడు చంద్రయాన్‌-03, ఆదిత్య ఎల్‌ఎల్‌, ఎక్స్‌పోశాట్‌, ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ సహా అధునాతన స్వదేశీ సాంకేతికతలతో కూడిన టెక్నాలజీ ప్రదర్శన మిషన్‌లు ఉన్నాయని వివరించారు.

దేశ 75వ స్వాతంత్య్రదినోత్సవం లోపు మొదటి మానవ రహిత మిషన్‌ను ప్రారంభించాలని భావిస్తున్నాం. ఈ దిశగా అన్నికోణాల్లో ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. శాస్త్రవేత్తలలో ప్రతి ఒక్కరు తమవంతు కృషిచేస్తున్నారు. నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకోగలమని ఆశిస్తున్నాను. అదేవిధంగా, చంద్రయాన్‌ -3 డిజైన్‌కు మార్పులు చేయడం, పరీక్షించడంలో చెప్పుకోదగిన పురోగతి సాధించించాం. వచ్చే ఏడాది మధ్యలో ఈ మిషన్‌ను ప్రారంభించవచ్చు అని తెలిపారు. కొవిడ్‌ మహమ్మారి కారణంగా, 2021లో జరగాల్సిన భారతదేశపు మొట్టమొదటి సోలార్‌ మిషన్‌ ఆదిత్య-ఎల్‌1తో సహా అన్ని భారీ శాస్త్రీయ మిషన్ల షెడ్యూల్‌ను ముందుకు జరపాల్సి వచ్చిందని శివన్‌ వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement