Tuesday, May 7, 2024

శ్రీలంకలో ప్రజాగ్రహం, మరీ తాలిబన్​ రేంజ్​లోనా?.. సోషల్​ మీడియాలో వీడియోలు, ఫొటోలు వైరల్​!

శ్రీలంక ఆర్థిక పరిస్థితులు దెబ్బతినడంతో రాజకీయ సంక్షోభం తలెత్తింది. దీనికి అక్కడి పాలకులు, లీడర్ల నిర్ణయాలే కారణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై ఒక్కసారిగా తిరుగుబాటు చేశారు. ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో దేశాధ్యక్షుడు అయిన గొటబాయ ఇంటి నుంచి పారిపోయారు. ఈ క్రమంలో ఆ దేశ ప్రధాని రణిల్​ విక్రమసింఘే ఇంటికి నిరసనకారులు నిప్పంటించారు. ఇట్లాంటి తీవ్ర పరిణాలమ మధ్య కొన్ని ఆసక్తికరన సన్నివేశాలు లంకలో కనిపిస్తున్నాయి. 

లకంలో పరిస్థితి అంతకంతకూ క్షీణిస్తుండటంతో గొటబాయ రాజపక్సే రాజీనామాకు అంగీకరించారు. జులై 13న రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాని రణిల్ విక్రమసింఘే కూడా అప్పటికప్పుడు రాజీనామా చేశారు. అయితే నిరసనకారులు ఆధీనంలో ఉన్న రాష్ట్రపతి భవన్ నుంచి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాష్ట్రపతి భవన్ లో నిరసనకారులు సరదాగా గడుపుతున్న వీడియోలు బయటకు వచ్చాయి.

స్మిమ్మింగ్ పూల్ లో ఈతకొడుతూ.. జిమ్ ఏరియాలో వ్యాయామం చేస్తూ చాలామంది కనిపించారు. గతేడాది ఆఫ్ఘానిస్తాన్ లోనూ ఇట్లాంటి దృశ్యాలే కనిపించాయి. ఆప్ఘానిస్తాన్ నుంచి అమెరికా దశలవారీ ఉపసంహరణ తర్వాత ఆగస్టు 2021లో తాలిబాన్ కాబూల్ ను స్వాధీనం చేసుకుంది. తాలిబన్లు తుపాకులు పట్టుకుని గవర్నర్ హౌస్, ప్రెసిడెంట్ ప్యాలెస్ వంటి ప్రధాన భవనాల్లోకి ప్రవేశించి ఎంజాయ్ చేస్తున్న వీడియోలు అప్పట్లో ఎన్నో బయటకు వచ్చాయి. సేమ్​ టు సేమ్​ శ్రీలంకలోనూ నిరసనకారులు అదే మాదిరిగా వ్యవహరించారని ఆ వీడియోలను చూసిన వారు కామెంట్స్​ చేస్తున్నారు.

తాలిబాన్లను గుర్తుచేస్తున్న లంక నిరసనకారులు..
తాజాగా శ్రీలంక వీడియోలను చూస్తుంటే తాలిబాన్లు గుర్తుకువస్తున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తాలిబాన్ల పిల్లలు కూడా పార్కులో ఊగుతూ, డ్యాన్స్ చేస్తూ కనిపించారు. నిరసనకారులు శ్రీలంక అధ్యక్ష భవనాన్ని ఆక్రమించినప్పుడు తాలిబన్లకు వారి మధ్య వ్యాత్యాసాన్ని గుర్తుతెచ్చుకుంటున్నారు. అధ్యక్షభవన్ లో మంచాలపై దూకడం, వంటగదిలో ఫుడ్​ కోసం వెతకడం, స్విమ్మింగ్​ పూల్​లో ఈతకొట్టడం, బాత్రూంలో స్నానం చేయడం, పియానో వాయించడం, శ్రీలంక జెండాతో హాలులో నినాదాలు చేయడం.. ఇట్లాంటి ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement