Thursday, April 25, 2024

రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు చంద్రబాబు మద్దతు.. ప్రకటించిన తెలుగుదేశం పార్టీ!

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు తెలుగుదేశం అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు మద్దతు పలికారు. దేశానికి తొలి గిరిజన మహిళ రాష్ట్రపతి కావడం వల్ల ముర్ముకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు చంద్రబాబు సోమవారం తెలిపారు. దీంతో రాష్ట్రంలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటించినట్టు అయ్యింది. టీడీపీకి లోక్‌సభలో ముగ్గురు ఎంపీలు, రాష్ట్ర అసెంబ్లీలో 23 మంది ఎమ్మెల్యేలున్నారు. కాగా, వైఎస్సార్‌సీపీకి 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలున్నారు.

ఇక.. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తొలి ఆదివాసీ మహిళ కావడంతో ఆమెకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం.. దీనిపై ఇంకేమీ ఆలోచించలేదు అన్నారు. అయితే.. 2017లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వనందున ఎన్డీఏ కూటమి నుంచి ఆ పార్టీ బయటకు వచ్చింది. 2019లో రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటి నుండి చంద్రబాబు బీజేపీకి సానుకూలంగా మాట్లాడుతూ వస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ మిత్రపక్షమైన జనసేనకు కూడా ఆయన అనుకూలంగా ఉంటున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement