Friday, April 26, 2024

చలివాగుకు సాగునీరు.. పంటలకు ప్రాణం పోసిన ఆంధ్రప్రభ

చిట్యాల, ప్రభ న్యూస్: తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. నీళ్లు లేక ఎండిపోయి ఎడారిని తలపిస్తున్న చలివాగుకు సాగునీరు రిలీజ్​ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో ఈ ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల శివారులోని చలివాగు సాగునీరు లేక ఎడారిగా మారింది. దీంతో చేతికొచ్చిన పంట పొలాలు ఎండిపోతున్నాయి. దీనిపై ఈ నెల 2వ తేదీన ఆంధ్రప్రభ జిల్లా పేజీలో కథనం ప్రచురితమైంది. ఈ వార్తకు స్పందించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, సంబంధిత అధికారులు ఎస్సారెస్పీ కాలువ ద్వారా శనివారం చలి వాగులోకి సాగునీరు వదిలారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.

చేతికొచ్చిన పంట పొలాలు సాగునీరు లేక ఎండిపోతున్నాయని బాధిత రైతులు ఆంధ్రప్రభకు తెలపడంతో, వారి ఇబ్బందులను ప్రచురించగా.. సంబంధిత అధికారులు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారం చూపారు. చలి వాగులోకి ఎస్సారెస్పీ కాలువ ద్వారా సాగునీరు రిలీజ్​ చేశారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. చేతికొచ్చే తమ పంట పొలాలు వరి ఎండిపోకుండా కాపాడిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, వార్త ప్రచురించిన ఆంధ్రప్రభ దినపత్రికకు రైతులు రవీందర్, ఐలయ్య, కుమార్, కిరణ్, రవి తదితర రైతులు అభినందనలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement