Saturday, April 27, 2024

ఐపీఎల్‌లో మిగతా మ్యాచ్‌లకు షెడ్యూల్ ఖరారు?

కరోనా కారణంగా ఆగిపోయిన ఐపీఎల్‌ 2021 సీజన్‌ మ్యాచ్‌లను ఈ సెప్టెంబరు, అక్టోబరులో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. లీగ్‌లో మిగిలిన 31 మ్యాచ్‌లను యూఏఈ వేదికగా నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తోంది. వాయిదా పడిన లీగ్‌ను ఎక్కడ, ఎలా, ఏ విండోలో నిర్వహించాలి, తదితర అంశాలపై తుది నిర్ణయాన్ని మే 29న జరిగే బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో తీసుకోనున్నారు.

ఈ సమావేశానికి ముందే టోర్నీలో మిగతా మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్‌ కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ 2021 సెప్టెంబర్‌ 19 లేదా 20న తిరిగి ప్రారంభమవుతుందని, ఫైనల్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 10న జరిగే అవకాశం ఉందని ఇండియా టుడే ఓ కథనంలో పేర్కొంది. ఇందులో 10 డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు, 4 ప్లేఆఫ్‌ రోజులు ఉండే అవకాశం ఉంది. భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య టెస్టు సిరీస్‌ సెప్టెంబర్‌ 14న ముగియనుంది. సిరీస్‌ ముగియగానే భారత్‌, ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు సెప్టెంబర్‌ 15న దుబాయ్‌ చేరుకోనున్నారు. టోర్నీ ఆరంభానికి ముందు వీరందరూ 3 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటారు. ఆటగాళ్లందరూ బయో బబుల్‌ నుంచి మళ్లీ మరో బబుల్‌లోకి వెళ్తున్నందుకు కఠిన క్వారంటైన్‌ అవసరం లేదని బోర్డు భావిస్తోంది. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ షెడ్యూల్‌లో మార్పులు చేయాలని ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డును..బీసీసీఐ అడిగే అవసరం లేదని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement