Monday, April 29, 2024

బోయపాటి తరువాత సినిమా రామ్ తోనే!!

ప్రస్తుతం బోయపాటి శ్రీను అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా తర్వాత బోయపాటి ఎవరితో సినిమా చేయబోతున్నాడనే దానిపై రకరకాల వార్తలు వస్తున్నాయి.

మొదట అల్లుఅర్జున్, రవితేజ పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ కరోనా కారణంగా ఆ హీరోల షెడ్యూల్స్ తారుమారు కావడంతో అందుబాటులో లేకుండా పోయారు. ఇప్పుడు తాజాగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పేరు వినిపిస్తోంది. లింగు స్వామి సినిమా తర్వాత బోయపాటి తో రామ్ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement