Monday, April 29, 2024

Delhi | అంగన్‌వాడీల్లో ఇంటర్నెట్, వైఫై, ఎల్ఈడీ స్క్రీన్లు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అంగన్వాడీ కేంద్రాల్లో ఆరేళ్ల‌ ఏళ్లలోపు పిల్లలకు మెరుగైన పోషకాహారం అందించడం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి సేవలను బలోపేతం చేసే లక్ష్యంతో ఏడాదికి 40 వేల చొప్పున దేశవ్యాప్తంగా ఐదేళ్ల‌లో 2 లక్షల అంగన్వాడీ కేంద్రాలను ‘సాక్షం అంగన్వాడీ కేంద్రాలు’గా అప్‌గ్రేడ్‌ చేయనున్నట్లు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు.

రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ ఈ ఏడాది ఆశావహ జిల్లాల పరిధిలో 40 వేల అంగన్వాడీ కేంద్రాలను సాక్షం అంగన్వాడీలుగా అప్‌గ్రేడ్‌ చేయబోతున్నట్లు ఆమె చెప్పారు. సాక్షం అంగన్వాడీల్లో ఇంటర్నెట్, వైఫై, ఎల్ఈడీ స్క్రీన్లు, స్మార్ట్ లెర్నింగ్, ఆడియో విజువల్ పరికరాలు, చైల్డ్-ఫ్రెండ్లీ లెర్నింగ్ పరికరాలను సమకూర్చనున్నట్లు తెలిపారు.

అలాగే న్యూట్రిషన్, ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ (ఈసీసీఈ)లకు సమాన ప్రాధాన్యత కల్పించే లక్ష్యంతో దేశ వ్యాప్తంగా ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అపప్‌గ్రేడ్‌ చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈమేరకు తమ ప్రతిపాదనలు పంపంవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు, ఎన్ని మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయన్న మరో ప్రశ్నకు మంత్రి బదులిస్తూ 6,837 మినీ అంగన్వాడీ కేంద్రాలు, 48,770 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలతో కలిపి మొత్తం 55,607 కేంద్రాలు ఉన్నట్లు మంత్రి జవాబిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement