Thursday, May 16, 2024

Results Released – ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుద‌ల

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుద‌ల‌య్యాయి. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఇంటర్‌ బోర్డు అధికారులు శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేశారు. విద్యార్థులు ఇంటర్‌ బోర్డ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లీ పరీక్షలను జూన్‌ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన విషయం విధితమే. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 933 పరీక్షాకేంద్రాల్లో సప్లీమెంటరీ పరీక్షలను నిర్వహించారు. ఫస్ట్ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌లో కలిపి మొత్తం 4,12,325 మంది పరీక్షకు హాజరయ్యారు. అలాగే ప్రాక్టికల్స్‌ను జూన్‌ 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించారు. ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల‌లో 62 శాతం మంది ఉత్తీర్ణ‌త సాధించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement