Tuesday, May 14, 2024

సౌత్​ సుడాన్​లో యుఎన్​ ఫోర్స్​ కమాండర్​గా ఇండియన్​.. లెఫ్టినెంట్​ జనరల్ మోహన్​ సుబ్రమణియన్​ నియామకం

దక్షిణ సూడాన్‌లోని ఐక్యరాజ్యసమితి మిషన్ (UNMISS)కి  కొత్త ఫోర్స్ కమాండర్‌గా భారత్​కు చెందిన లెఫ్టినెంట్ జనరల్ మోహన్ సుబ్రమణియన్‌ను నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఇవ్వాల (బుధవారం) ప్రకటించారు. లెఫ్టినెంట్ జనరల్ సుబ్రమణియన్ భారత లెఫ్టినెంట్ జనరల్ శైలేష్ తినాయకర్ స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. UNMISS ఫోర్స్ కమాండర్‌గా తినైకర్ అంకితభావంతో పనిచేశారని సమర్థవంతమైన నాయకత్వంతో ముందుకు సాగారని గుటెర్రెస్ కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, లెఫ్టినెంట్ జనరల్ సుబ్రమణియన్ 36 సంవత్సరాలకు పైగా భారత సైన్యంతో విశిష్ట సైనిక వృత్తిలో ఉన్నారు. ఇటీవల, అతను మధ్య భారతదేశంలో సైనిక ప్రాంతం (ఆపరేషనల్ మరియు లాజిస్టిక్ రెడీనెస్ జోన్) జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా పనిచేశారు.  గతంలో అతను రక్షణ మంత్రిత్వ శాఖ (ఆర్మీ) (2019-2021) యొక్క ఇంటిగ్రేటెడ్ హెడ్‌క్వార్టర్స్ లో ప్రొక్యూర్‌మెంట్, ఎక్విప్‌మెంట్ మేనేజ్‌మెంట్ కోసం అదనపు డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. (2019-2021), స్ట్రైక్ ఇన్‌ఫాంట్రీ డివిజన్ కమాండింగ్ జనరల్ ఆఫీసర్ (2018-2019), డిప్యూటీ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ పదాతిదళ విభాగం (2015-2016), కమాండర్ ఆఫ్ ఎ మౌంటైన్ బ్రిగేడ్ (2013-2014) భారత సాయుధ దళాలలోని ఇతర నియామకాలలో కూడా ఉన్నారు. అంతేకాకుండా వియత్నాం, లావోస్, కంబోడియాలకు భారతదేశం యొక్క డిఫెన్స్ అటాచ్‌గా (2008-2012) మరియు 2000లో సియెర్రా లియోన్‌లోని ఐక్యరాజ్యసమితి మిషన్‌లో స్టాఫ్ ఆఫీసర్‌గా పనిచేసిన అనుభవం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement