Thursday, April 25, 2024

భారత వృద్ధిరేటు తగ్గించిన ఏడీబీ.. 7 శాతం ఉంటుందని అంచనా

ఈ ఆర్థిక సంవత్సరం భారత వృద్ధిరేటు 7 శాతం వరకు ఉంటుందని ఆసియా అభివృద్ధి బ్యాంక్‌(ఏడీబీ) అంచనా వేసింది. గతంలో బ్యాంక్‌ వృద్ధిరేటు 7.2 శాతం ఉంటుదని వేసిన అంచనాను ప్రస్తుతం సవరించింది. ఏషియన్‌ డెవలమ్‌మెంట్‌ అవుట్‌లుక్‌ 2022 సప్లింమెంట్‌లో ఆసియా దేశాల వృద్ధిరేటు అంచానను 4.3 శాతానికి తగ్గించింది. గతంలో దీన్ని బ్యాంక్‌ 5.2 శాతంగా అంచనా వేసింది. దక్షిణాసియాలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్‌ వృద్ధి రేటు 2023 మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి 7 శాతానికి మించకపోవచ్చని తెలిపింది.

అంచనాలను మించిన ద్రవ్యోల్బణం, ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడం వంటివిదీనికి కారణాలని తెలిపింది. ధరల పెరుగుదల దేశీయ వినియోగం ప్రభావం చూపుతుందని ఏడీబీ స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ తగ్గడంతో ఎగుమతులు కూడా పడిపోతాయని అంచనా వేసింది. చైనా ఆర్థిక వ్యవస్థ 3.3 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని తెలిపింది. గతంలో చైనా వృద్ధిరేటు 5 శాతం ఉంటుందని పేర్కొంది. లాక్‌డౌన్‌, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో సమస్యలు వంటి కారణాలతో చైనా వృద్ధిరేటు తగ్గడానికి కారణాలని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement