Saturday, May 18, 2024

భార‌తీయుడు2 షూట్ స్టార్ట్-అప్ డేట్ ఇచ్చిన మేక‌ర్స్

విశ్వ నటుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన భారతీయుడు చిత్రం ఎంత‌పెద్ద హిట్ అయిందో తెలిసిందే. కాగా ఈ చిత్రానికి సీక్వెల్ ప్రారంభ‌మ‌యి ప‌లు కార‌ణాల వ‌ల్ల ఆగిపోయింది. అయితే ఇండియన్-2 చిత్రం గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. ట్వీట్ ద్వారా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడో తెలిపారు. ఆ ట్వీట్ ప్రకారం.. సెప్టెంబర్ నుంచి ‘భారతీయుడు-2’ షూట్ స్టార్ట్ కానున్నట్లు తెలిపారు. ఈ విషయమై విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌, డైరెక్టర్ శంక‌ర్‌, హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్‌డేట్ ఏంటంటే లైకా ప్రొడక్షన్స్ తో పాటుగా ఈ సినిమా రిలీజ్, నిర్మాణంలో మరో ప్రముఖ సంస్థ రెడ్ జయింట్ వారు కూడా భాగం అయ్యారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థ అధినేత అయిన ఉదయ నిధి స్టాలిన్ ను ట్యాగ్ చేసి కమల్ హాసన్ ‘వెల్ కమ్ ఆన్ బోర్డ్ తంబి’ అంటూ ట్వీట్ చేశారు. తాజా షెడ్యూల్ లో కమల్ హాసన్ , కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొననున్నారు. ఈ అప్ డేట్ తో క‌మ‌ల్ హాస‌న్ ఫ్యాన్స్ ఆనందంలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement