Tuesday, May 21, 2024

Asian Shooting | భారత జట్టు ఇదే..

నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) శనివారం రాబోయే ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌ల కోసం తన జట్టును ప్రకటించింది. ఈ ప్రీమియర్ కాంటినెంటల్ టోర్నమెంట్ అక్టోబర్ 22 నుంచి నవంబర్ 2 వరకు దక్షిణ కొరియాలోని చాంగ్వాన్‌లో జరగనుంది. ఈ టోర్నీతో పారిస్ ఒలింపిక్స్ 2024 లో తమ కోటా స్థానాలను పొందేందుకు భారత షూటర్‌లకు మరో అవకాశం లభించనుంది.

ఈ టోర్నమెంట్ పారిస్ ఒలంపిక్స్ కోసం 24 కోటాలను అందిస్తుంది… కాగా, మను భాకర్, దివ్యాంష్ సింగ్ పన్వార్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, అఖిల్ షెరాన్, రిథమ్ సాంగ్వాన్, ఈషా సింగ్, ఆదర్శ్ సింగ్, కినాన్ చెనాయ్, గణేమత్ సెఖోన్ వంటి వారికి వచ్చే వేసవి పారిస్‌ కోటాను పొందేందుకు ఇది మరో అవకాశం.

Advertisement

తాజా వార్తలు

Advertisement