Monday, April 29, 2024

భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు

షేర్ మార్కెట్లు ఇవాళ కుదేళయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తుండడంతో సూచీలు నష్టాల బాట పట్టాయి. ఇన్వెస్టర్లు అందరూ కూడా అమ్మకాన్ని మొగ్గు చూపారు. దీంతో స్టాక్స్ అన్ని కూడా నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. దీంతో వరుసగా రెండో రోజు కూడా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. దాదాపు అన్ని రంగాల షేర్లూ నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. 49,201 వద్ద రోజును ప్రారంభించిన సెన్సెక్స్ 740 పాయింట్ల కోల్పోయి 48,440 వద్ద ముగిసింది. ఇక, 14,570 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన నిఫ్టీ 224 పాయింట్లు కోల్పోయి 14324 వద్ద స్థిరపడింది. టాటా స్టీల్, ఐసీఐసీఐ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్‌డీఎఫ్‌సీ స్వల్ప లాభాలను ఆర్జించగా.. మారుతీ సుజుకీ, ఐఓసీ, హెచ్‌యూఎల్, కోల్ ఇండియా నష్టాలను మూటగట్టుకున్నాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement