Wednesday, May 1, 2024

బర్నింగ్ స్టార్ బజార్ రౌడీ టీజర్

హృదయ కాలేయం సినిమాతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు హీరో సంపూర్ణేష్ బాబు. ఆ తరువాత కొబ్బరిమట్ట వంటి సినిమాలతో ప్రేక్షకుల మన్ననలు పొందాడు. ప్రస్తుతం వసంత నాగేశ్వర రావు దర్శకత్వంలో బజార్ రౌడీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను KS క్రియేషన్స్ బ్యానర్‌పై సందిరెడ్డి శ్రీనివాస్ రావు నిర్మిస్తుండగా… సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నాడు.ఇక తాజాగా ఈ సినిమాకు సంబందించిన టీజర్ విడుదల అయింది. టీజర్ లో పంచ్ డైలాగులతో సంపూ అదరగొట్టాడు. కామెడీతో పాటు ఈ సినిమాలో రొమాన్స్ కూడా బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మహేశ్వరి వద్ది ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఆ బజార్ రౌడీ టీజర్ ఎలా ఉందొ మీరు కూడా ఓ లుక్కేయండి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement