Monday, April 29, 2024

టోక్యో వెయిట్‌లిఫ్టింగ్‌లో భార‌త్ రికార్డ్.. పతకాన్ని సాధించిన తొలి భారత మ‌హిళ‌

టోక్యో విశ్వక్రీడల్లో మణిపుర్‌ మాణిక్యం మీరాబాయి చాను భారత సత్తా చాటింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో 21ఏళ్ల పతక నిరీక్షణకు తెరదించింది. 49కేజీల విభాగంలో మీరా రజత పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో ఒలింపిక్స్‌లో సిల్వ‌ర్‌ మెడల్‌ సాధించిన తొలి భారత వెయిట్‌లిఫ్టర్‌గా రికార్డు సృష్టించింది. స్నాచ్‌లో 87కేజీలు ఎత్తిన మీరా క్లీన్‌ అండ్‌ జర్క్‌లో మొత్తం 115కేజీలు ఎత్తి రజతాన్ని ముద్దాడింది. మొత్తం 202కేజీలను ఎత్తిన 26ఏళ్ల మీరాబాయి చాను విశ్వ‌క్రీడల్లో భారత కీర్తిపతాకాన్ని ఎగురవేసింది.

2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో తెలుగుతేజం కరణం మల్లిశ్వరి కాంస్యం సాధించి విశ్వక్రీడల్లో పతకాన్ని సాధించిన లిఫ్టర్‌గా నిలిచింది. అనంతరం ఈ ఏడాది మీరా.. మల్లిశ్వరిని అధిగమించి రజతం అందించి మరో మెట్టు పైకి ఎక్కింది. రెండు దశాబ్దాల అనంతరం ఒలింపిక్స్‌లో భారత్‌కు మళ్లి వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకం లభించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement