Sunday, April 28, 2024

ఆసియా క్రీడ‌ల‌కు మ‌న‌ క్రికెట్ జ‌ట్లు రెడీ.. డైరెక్ట్‌గా క్వార్ట‌ర్ ఫైన‌ల్స్‌లోకి టీమిండియా

చైనాలో జరగనున్న 19వ ఆసియా క్రీడల్లో భారత మహిళల, పురుషుల క్రికెట్ జట్లు ఈవెంట్‌లో పాల్గొంటున్నాయి. అయితే.. మెరుగైన ర్యాంకింగ్ కారణంగా, రెండు జట్లూ డైరెక్ట్ గా ఈవెంట్‌ క్వార్టర్ ఫైనల్స్‌లో పోటీపడతాయి. ఆసియా క్రీడల్లో భారత మహిళల, పురుషుల క్రికెట్ జట్లను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇప్పటికే ప్రకటించింది. ఇందులో, వన్డే ప్రపంచకప్ కారణంగా, యువ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆసియా క్రీడల్లో టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా కనిపించనుండగా, అలాగే మహిళల జట్టు హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీ బాద్య‌త‌లు నిర్వ‌హించ‌నుంది.

భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై విధించిన 2 మ్యాచ్‌ల నిషేధం కారణంగా, టీమిండియా ఫైనల్స్‌కు చేరుకుంటేనే ఆమెకు ఆడే అవకాశం లభిస్తుంది. 19వ ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్ ఈవెంట్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం అవ్వ‌నుండ‌గా… ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 26న జరుగుతుంది. పురుషుల క్రికెట్ ఈవెంట్ సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 7వ‌ర‌కు జరగనుంది.

19వ ఆసియా క్రీడల్లో క్రికెట్ ఈవెంట్ మ్యాచ్‌లు చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతాయి, ఇందులో అన్ని మ్యాచ్‌లు జెజియాంగ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ గ్రౌండ్‌లో జరుగుతాయి.

- Advertisement -

భారత పురుషుల జట్టు :

రితురాజ్ గైక్వాడ్ (c), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (WK), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివమ్ దూబే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్).

రిజర్వ్ ప్లేయర్ : యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్.

భారత మహిళల జట్టు :

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, దేవిక వైద్య, అంజలి సర్వాణి, టిటాస్ సాధు, రాజేశ్వరి గైక్వాడ్ , కనికా అహుజా, ఉమా ఛెత్రి (వికెట్-కీపర్), అనూషా బరెడ్డి.

రిజర్వ్ ప్లేయర్ : హర్లీన్ డియోల్, కశ్వీ గౌతమ్, స్నేహ రాణా, సయ్కా ఇషాక్, పూజా వస్త్రాకర్.

ఆసియా క్రీడలు 2023 క్రికెట్ ఈవెంట్‌ల పూర్తి షెడ్యూల్ ఇదే..!

సెప్టెంబర్ 19 – హాంకాంగ్ vs చైనా, రౌండ్ 1, 9:30 AM IST

19 సెప్టెంబర్ , నేపాల్ vs సింగపూర్, రౌండ్ 1, 2:30 PM IST

సెప్టెంబర్ 20 – ఇండోనేషియా vs మలేషియా, రౌండ్ 1, 9:30 AM IST

సెప్టెంబర్ 20 – మ్యాచ్ 1 విజేత vs మ్యాచ్ 2 విజేత, రౌండ్ 1, 2:30 PM IST

సెప్టెంబర్ 21 – UAE vs భూటాన్, రౌండ్ 1, 9:30 AM IST

సెప్టెంబర్ 21 – థాయిలాండ్ vs ఒమన్, రౌండ్ 1, 2:30 PM IST

సెప్టెంబర్ 22 – భారత్ vs మ్యాచ్ 4 విజేత, క్వార్టర్ ఫైనల్ 1, 9:30 AM IST

సెప్టెంబర్ 22 – పాకిస్తాన్ vs 3వ మ్యాచ్ విన్నర్ టీమ్, క్వార్టర్ ఫైనల్ 2, 2:30 PM IST

సెప్టెంబర్ 24 – 3వ జట్టు vs 4వ మ్యాచ్ విన్నర్, క్వార్టర్ ఫైనల్ 3, 9:30 AM IST

సెప్టెంబర్ 24 – నాల్గవ జట్టు vs ఐదవ మ్యాచ్ విజేత, క్వార్టర్ ఫైనల్ 4, 2:30 PM IST

సెప్టెంబర్ 25 – మొదటి సెమీ-ఫైనల్, ఉదయం 9:30 IST

సెప్టెంబర్ 25 – రెండవ సెమీ-ఫైనల్, మధ్యాహ్నం 2:30 IST

సెప్టెంబరు 26 – ఉదయం 9:30 గంటలకు IST కాంస్య పతక మ్యాచ్

Advertisement

తాజా వార్తలు

Advertisement