Monday, May 20, 2024

మరో 500 మిలియన్‌ డాలర్ల రుణం మంజూరు.. కొలంబోలో కొనసాగుతున్న నిరసనలు

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు మరింత ఆర్థిక సాయం అందించేందుకు భారత్‌ ముందుకు వచ్చింది. పెట్రో ఉత్పత్తుల దిగుమతి చేసుకునేందుకు మరో 500 మిలియన్‌ డాలర్ల మొత్తాన్ని రుణంగా ఇచ్చేందుకు ముందుకువచ్చింది. ఈ విషయాన్ని శ్రీలంక ఆర్థిక మంత్రి సబ్రి వెల్లడించారు. మరో 100 కోట్ల డాలర్ల మొత్తాన్ని కూడా రుణంగా ఇచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) నుంచి ఉద్దీపన ప్యాకేజీ ఆలస్యమవుతున్న నేపథ్యంలో భారత్‌ సాయం అందించేందుకు ముందుకువచ్చింది. ప్రస్తుతం సబ్రి వాషింగ్డన్‌లో ఉన్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే కనీసం 400 కోట్ల డాలర్ల రుణం అవసరమన్న సబ్రి ఐఎంఎఫ్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. గడచిన రెండురోజుల్లో ఆందోళనలు మరింత పెరిగాయి. చైనా కూడా ఆర్థిసాయం సహా అనేక అంశాల్లో సాయం అందించేందుకు ముందుకువస్తోందని ప్రధాని మహింద రాజపక్స శనివారం ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement