Monday, May 20, 2024

జవహర్‌లాల్‌ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు

పరవాడ (విశాఖపట్నం) ప్రభ న్యూస్‌: పరవాడ ఫార్మా సిటీలో ఎస్‌ ఎన్‌ ఎఫ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమలు శనివారం మూడు గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు ఎగిసి పడటంతో ఆందోళన చోటుచేసుకుంది. కార్మిక సంఘాలు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన పై సమగ్ర విచారణ చేయాలని యాజమాన్యంపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఫార్మాసిటీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు గని శెట్టి సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఫార్మా పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి వెల్డింగ్‌ పనులు నిర్వహిస్తున్నప్పుడు భద్రత చూడవలసిన పరిశ్రమభద్రతా అధికారులు సక్రంగా పరిరక్షించుకోవడం భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఆయన ఆరోపించారు. ప్రమాదంపై సమగ్ర విచారణ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. జిల్లా అధికారులు ఫార్మా పరిశ్రమలపై ఆడిట్‌ నిర్వహించాలని ఆయన కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఈ పరిశ్రమ చర్యలు తీసుకోవాలని గని శెట్టి డిమాండ్‌ చేశారు. ఈ ప్రమాదంపై జిల్లా కలెక్టర్‌ కు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ఇన్‌ స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ కి ఫిర్యాదు చేస్తున్నట్లు గని శెట్టి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement