Saturday, May 4, 2024

IND vs AUS : సిరీస్ భాగ్యం ఎవరికో?.. నేడు ఉప్పల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా నిర్ణయాత్మక మ్యాచ్..!

  • సాయంత్రం 7 గంట‌లకు మ్యాచ్‌ ప్రారంభం

మూడో టీ 20 కోసం భారత్‌ – ఆస్ట్రేలి యా జట్లు సన్నద్దమయ్యాయి. మూడు టీ 20 మ్యాచ్‌ లో ఇప్పటికే చెరొకటి గెలిచి సమంగా ఉన్న ఇరు జట్లు చివరి మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాయి. ఈ మ్యాచ్ ఈరోజు రాత్రి ఉప్పల్‌ వేదికగా జరగనుంది. ఈ సందర్బంగా ఇరుజట్ల మధ్య బలబలాలు తెలుసుకుం దాం. టీ 20 సిరీస్‌లలో భాగంగా తొలిమ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైన టీమ్‌ ఇండియా తర్వాత జరిగిన పోరులో ప్రతీకారం తీర్చుకుంది. ఇక చివరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను ముద్దాడాలని పట్టుదలతో ఉంది. బ్యాటర్లు పరుగులు సాధించినా బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం ఆందోళన కలిగిస్తోంది. తొలిమ్యాచ్‌లో టీమ్‌ ఇండి యా 209 పరుగులు చేసి కూడా ఓటమి పాలు కావటం జట్టు బౌలింగ్‌ , ఫీల్డింగ్‌ వైఫల్యాలను ఎత్తి చూపింది. అక్షర్‌ పటేల్‌ ఒక్కడే పొదుపుగా బౌలింగ్‌ చేస్తూ వికెట్లు తీయడం రోహిత్‌ సేనకు సానుకూ లాంశంగా ఉంది. సీనియర్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ భారీగా పరుగులు సమ ర్పించుకోవడం వల్ల రెండో మ్యాచ్‌లో చోటు కోల్పోవాల్సి వచ్చింది. అటు డెత్‌ ఓవర్‌ స్పెషలిస్ట్‌ హర్షల్‌ పటేల్‌, స్పిన్నర్‌ చాహల్‌ బంతితో ప్రత్యర్థిని కట్టడి చేయలేకపోతున్నారు. ఈ సిరీస్‌లో ఆరు ఓవర్లకు 81 పరుగుల్ని సమర్పించుకున్న బౌలర్‌గా హర్షల్‌ పటేల్‌ నిలిచాడు. బుమ్రా అందుబాటు లోకి రావడం భారత్‌కు కొంత కలిసొచ్చే అంశంగా మారింది. బ్యాటింగ్‌లో రోహిత్‌, రాహుల్‌, కోహ్లి రాణించాలని, చివరి మ్యా చ్‌లోనూ సూర్య కుమార్‌ యాదవ్‌, హర్థిక్‌, దినేష్‌ కార్తిక్‌ మెరుపులు మెరిపించాలని యాజమా న్యం భావిస్తోంది.

బౌలింగ్‌లో సతమతమవుతున్న ఆసీస్‌..
పర్యాటక జట్టు ఆసిస్‌ కూడా బౌలింగ్‌ లోపాలతో సతమతమవుతోంది. గాయాలతో దూరమైన నాథన్‌ ఎల్లిస్‌, కమ్మిన్స్‌ స్థానంలో వచ్చిన హేజిల్‌ వుడ్‌, సామ్స్‌ టీమ్‌ ఇండియా బ్యాటర్లకు కళ్లెం వేయలేకపోతున్నా రు. భారత బ్యాటర్ల బలహీనతలను చక్కగా ఉపయో గించుకున్న స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా ఫలితం రాబట్టా డు. కెప్టెన్‌ ఫించ్‌, కీపర్‌ మాథ్యూ వేడ్‌. ఆసిస్‌ బ్యాటింగ్‌ కు వెన్నెముకలా నిలుస్తున్నారు. 2 మ్యాచ్‌ల్లో కలిపి ఒకే పరుగు చేసిన హిట్టర్‌ మాక్స్‌వెల్‌ ఫామ్‌ అందుకోవా లని కంగారుల జట్టు ఆశిస్తోంది. ఇరుజట్ల మధ్య చివరిదైన మూడో టీ20 ఆదివారం రాత్రి ఏడుగంట లకు మ్యాచ్‌ జరగనుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement