Sunday, October 13, 2024

Big Story | ఐటీలో సాటిలేని మేటి.. ప్రపంచంలోని 10 నగరాల జాబితాలో హైదరాబాద్‌కు స్థానం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రపంచంలోని మేటి నగరాల జాబితాలో హైదరాబాద్‌ను నిలపాలనే తెలంగాణ సర్కారు సంకల్పం నెరవేరిందని మరోసారి రుజువైంది. మౌలిక సదుపాయాలు… బెస్ట్‌ లివింగ్‌ సిటీ వంటి సర్వేల్లో విశ్వ నగరాలను సైతం వెనక్కి నెట్టిన హైదరాబాద్‌ మహా నగరం.. ఇప్పుడు ఏకంగా ప్రపంచ ఐటీ- నగరంగా ఖ్యాతిని గడించింది. వాషింగ్టన్‌ డీసీ, ఆస్టిన్‌నూ దాటేసి దేశంలో నెంబర్‌ వన్‌గా నిలిచింది. ప్రపంచంలోని మేటి నగరాల జాబితాలో హైదరాబాద్‌ను నిలపాలనే తెలంగాణ సర్కారు సంకల్పం నెరవేరిందని మరోసారి రుజువైంది. మౌలిక సదుపాయాలు… బెస్ట్‌ లివింగ్‌ సిటీ వంటి సర్వేల్లో విశ్వ నగరాలను సైతం వెనక్కి నెట్టిన హైదరాబాద్‌ మహా నగరం.. ఇప్పుడు ఏకంగా ప్రపంచ ఐటీ నగరంగా ఖ్యాతిని గడించింది.

సీటెల్‌ వాషింగ్టన్‌ ప్రధాన కార్యాలయాలుగా పని చేసే ప్రముఖ టెక్నికల్‌ ఇంటర్వ్యూ సంస్థ కారత్‌ తాజాగా విడుదల చేసిన నివేదికలో హైదరాబాద్‌ నగరం ప్రపంచంలోని టాప్‌-20 నగరాల్లో పదో స్థానంలో నిలిచింది. టెకీల నియామకంలో హైదరాబాద్‌ దేశంలోని అన్ని నగరాల కంటే ముందుండటం ఒక వంతైతే… ప్రపంచంలోని టాప్‌-20 నగరాల్లో ఏకంగా పదో స్థానాన్ని కైవసం చేసుకోవడం రికార్డు. అంతేకాదు.. ప్రతిభ ఉన్న టెకీల కోసం అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌ వైపు చూస్తున్నాయని నివేదికలో వెల్లడైంది.

- Advertisement -

ప్రపంచస్థాయి హబ్‌లను వెనక్కి నెట్టి..

హైదరాబాద్‌ ప్రపంచంలోని ప్రముఖ ఐటీ హబ్‌లను కూడా వెనక్కి నెట్టి రికార్డు సృష్టించిందని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇపప్‌డున్న పరిసక్థితుల్లో వాషింగ్టన్‌, ఆస్టిన్‌ వంటి టెక్‌ హబ్‌లు, లాస్‌ ఏంజిల్స్‌, కాన్సాస్‌ వంటి అగ్ర నగరాల కంటే హైదరాబాద్‌ ముందంజలో ఉన్నది. చరిత్రాత్మకంగా కొన్ని కంపెనీలు నియామకాల కోసం భారతదేశం వైపు చూస్తున్నాయని, తక్కువ వ్యయంతో ఎక్కువ నైపుణ్యం ఉన్న వారు వచ్చే అవకాశాలుండటమే ఇందుకు కారణం అని తెలిపారు. టెకీల నియామకంలో నగరాలకు ఇచ్చిన ర్యాంకింగ్‌ ఆధారంగా ఆయా నగరాలకు గ్లోబల్‌ కంపెనీల పెట్టుబడులు కూడా అదే స్థాయిలో ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆయా నగరాల్లో ఉండే అనుకూలతల ఆధారంగానే కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తాయని, తద్వారా టెకీల నియామకం కూడా పెరుగుతుందని హైదరాబాద్‌కు చెందిన ఐటీ ప్రముఖులు వెల్లడిస్తున్నారు.

ఐటీ శిక్షణల్లో అంతర్జాతీయ కేంద్రంగా హైదరాబాద్‌

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నుంచి హైదరాబాద్‌ ఐటీ రంగంలో విప్లవాత్మక పురోగతి కనిపిస్తుంది. అనేక విభాగాల్లో హైదరాబాద్‌ మహానగరం బెంగళూరును వెనక్కి నెట్టినట్టు పలు నివేదికల్లో వెల్లడైంది. అత్యాధునిక టెక్నాలజీల్లో మంచి నైపుణ్యం ఉన్నవారికి హైదరాబాద్‌ నగరంలోని ఐటీ కంపెనీల్లోనే పుష్కలమైన అవకాశాలు లభిస్తున్నాయి. ఇక్కడ ఐటీకి సంబంధించిన కోచింగ్‌ సంస్థలతోపాటు ప్రముఖ విద్యా సంస్థలు ఐటీ కోర్సుల్లో మెరుగైన శిక్షణ ఇస్తుండటంతో క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారానే ఐటీ కంపెనీలు ఉద్యోగులను నియమించుకొంటున్నాయి. ముఖ్యంగా కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌లో తెలుగువారు ఎక్కువగా రాణిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పలువురు ఐటీ కోర్సులు నేర్చుకొనేందుకు హైదరాబాద్‌ వస్తున్నారు. శిక్షణ అనంతరం ఉద్యోగాలు సైతం నగరంలోని ఐటీ కంపెనీల్లో పొందుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌ నగరానికి భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులు పెరగడమే టెకీల నియామకంలో భారీ వృద్ధి నమోదుకు కారణంగా స్పష్టమవుతున్నది. 2014-15 నుంచి 2021-22 వరకు దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల మంది టెకీల నియాకం జరగడం ఇందుకు అద్దం పడుతోంది.

దేశ వ్యాప్త నగరాల్లో హైదరాబాద్‌ పదోస్థానం

ప్రపంచ ఐటీ రంగంలో ఆయా దేశాల్లోని నగరాల్లో పరిస్థితిపై కారత్‌ సంస్థ ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా సాప్ట్‌వేర్‌ డెవలపర్స్‌ నియామకం, టెక్నికల్‌ ఇంటర్వ్యూల్లో ప్రపంచంలోని అనేక నగరాల పనితీరుపై సర్వే నిర్వహించి కొన్నిరోజుల క్రితం నివేదిక విడుదల చేసింది. సాధారణంగా ఐటీ కంపెనీలు తమ విస్తరణలో భాగంగా టెకీల నియామకాలు చేపడతాయి. పలు నగరాల్లో టెకీల నియామకం ఎలా ఉన్నదనే అంశంపై కారత్‌ ప్రధానంగా దృష్టిపెట్టింది. దేశాల పరంగా ఈ జాబితాలో సింగపూర్‌ మొదటి స్థానంలో నిలిచింది. నగరాల జాబితాలో హైదరాబాద్‌ పదో స్థానంలో ఉన్నది. ముఖ్యంగా జాబితాలో దేశంలోని ఆరు నగరాలు ఉండగా, అవన్నీ హైదరాబాద్‌ కంటే వెనుకనే ఉన్నాయి. చెన్నై (24 శాతం), గుర్గావ్‌ (23 శాతం), బెంగళూరు (22 శాతం), పుణ (20 శాతం), ముంబై (18 శాతం) టాప్‌-25 జాబితాలో నిలిచాయి.

తెలంగాణలో ఉన్న ఐటీ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు

సంవత్సరం ఉద్యోగాలు
2014-15 3,71,774
2015-16 4,07,385
2016-17 4,31,891
2017-18 4,75,308
2018-19 5,43,033
2019-20 5,82,126
2020-21 6,28,615
2021-22 7,78,121

Advertisement

తాజా వార్తలు

Advertisement