Wednesday, April 24, 2024

ఓఎన్‌జీసీకి 248 కోట్ల నష్టం.. 4వ త్రైమాసిక ఫలితాలు ఇవే..

ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్‌ అండ్‌ నేచరల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) 4వ త్రైమాసిక ఆర్ధిక ఫలితాలు వెల్లడించింది. ఈ త్రైమాసికంలో సంస్థ 247.70 కోట్ల రూపాయల నష్టాన్ని ప్రకటంచింది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో సంస్థ 8,859.54 కోట్ల రూపాయల నికర లాభాన్ని నమోదు చేసింది. సంస్థ చేస్తున్న వివిధ పనులకు సర్వీస్‌ టాక్స్‌ చెల్లించాలని ఆదేశించింది. దీంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లిస్తున్న రాయల్టిలపై జీఎస్టీ చెల్లించాలని కోరింది. ఈ నిర్ణయాలను ఓఎన్‌జీసీ కోర్టులో సవాల్‌ చేసింది. కేసు కోర్టులో ఉన్నందున సర్వీస్‌ ట్యాక్స్‌, రాయల్టిd పై జీఎస్టీ చెల్లింపుల కోసం వడ్డీతో సహా 11,558 కోట్ల రూపాయలను కోర్టులో డిపాజిట్‌ చేసింది.

పన్నుల్లో తేడాలు, ఇతర పెనాల్టిల కింద 1,862 కోట్లను కూడా డిపాజిట్‌ చేసినట్లు తెలిపింది. ముడి చమురు, గ్యాస్‌పై జీఎస్టీ వర్తించనందున వీటిపై చెల్లిస్తున్న రాయల్టికి జీఎస్‌టీ చెల్లించాలన్న దానిపై తాము న్యాయస్థానంలో కేసు దాఖలు చేసినట్లు ఓఎన్‌జీసీ తెలిపింది. 2016 ఏప్రిల్‌ 1 నుంచి 2023 మార్చి 31 వరకు వివాదాస్పదమైన జీఎస్టీ, ఇతర పన్నుల కోసం సంస్థ 12,107 కోట్లను కేటాయించిందిందని తెలిపింది. ఇది కంపెనీ లాభాలపై ప్రభావం చూపిందని తెలిపింది.

- Advertisement -

ఈ త్రైమాసికంలో ఓఎన్‌జీసీ ఆదాయం 5.2 శాతం పెరిగి 36,293 కోట్లుగా నమోదైనట్లు తెలిపింది. మొత్తం 2022-23 ఆర్ధిక సంవత్సరంలో ఓఎ న్‌జీసీ 38,829 కోట్ల రూపాయల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకు ముందు ఆర్ధిక సంవత్సరంలో 0,306 కోట్ల నికర లాభంతో పోల్చితే ఈసారి 3.7 శాతం తక్కువగా నమోదు చేసింది. ఓఎన్‌జీసీ ఉత్పత్తి చేసిన ముడి చమురు ప్రతి బ్యారెల్‌కు 2022-23లో 91.90 డాలర్లు పొందింది. అంతకు ముందు సంవత్సరం ఇది బ్యారెల్‌కు 94.98 డాలర్లుగాఉంది. ఓఎన్‌జీసీ ప్రతి షేరుకు 11.25 రూపాయలు చెల్లించింది. మొత్తం డివిడెండ్‌ కింద 14,153 కోట్లు చెల్లించింది.
మొత్తం 2022-23 సంవత్సరంలో 21.5 మిలియన్‌ టన్నుల ముడి చమురును, 21.3 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేసినట్లు తెలిపింది.

అంతకు ముందు సంవత్సరంలోపోల్చితే ముడి చమురు ఉత్పత్తి 1 శాతం, గ్యాస్‌ ఉత్పత్తి 1.5 శాతం తక్కువగా ఉందని తెలిపింది. ప్రధానంగా కేజీ-98బై2 క్షేత్రంలో చమురు, సహాజ వాయివు వెలికితీయడంలో జరిగిన జాప్యం వల్ల ఉత్పత్తి తగ్గినట్లు తెలిపింది. విదేశాల్లో సంస్థ చమురు ఉత్పత్తి తగ్గింది. 2021-22 సంవత్సరంలో 8.1 మిలియన్‌ టన్నుల ముడి చమురును ఉత్పత్తి చేస్తే, 2022-23లో ఇది 6.35 మిలియన్‌ టన్నులుగా ఉంది. ముడి చమురు ధరలు ఎక్కువగా ఉన్నందున లాభం మాత్రం పెరిగింది. అంతకు ముందు సంవత్సరం నికర లాభం 1,589 కోట్లు వస్తే ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇది 1,700 కోట్లుగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement