Tuesday, May 7, 2024

అమెరికాలో.. రామ్ చ‌ర‌ణ్ కి సూప‌ర్ క్రేజ్

మార్చి 12న ఆస్కార్ అవార్డుల ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. ఈ నేపథ్యంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అమెరికాకు వెళ్లారు. చ‌ర‌ణ్ అమెరికాలో ల్యాండ్ కాగా ఆయ‌న‌కి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటునాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ పాటకు ఆస్కార్ రావడం ఖాయమనే అంచనాలు భారీగా ఉన్నాయి. కాగా త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి కూడా అమెరికాకు వెళ్లనున్నారు.
మరోవైపు, రామ్ చరణ్ జీఎంఏ (గుడ్ మార్నింగ్ అమెరికా) టెలివిజన్ షోన్ లో కనిపించారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఘన విజయంపై ఆయన మాట్లాడారు. ఫిబ్ర‌వ‌రి 24న‌ జరగనున్న హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ వేడుకలో ఆయన ప్రెజెంటర్ గా వ్యవహరించనున్నారు. ఇంతవరకు టాలీవుడ్ లో మరెవరికీ ఈ ఘనత దక్కలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement