Wednesday, May 8, 2024

ఐకాన్ స్టార్ ‘ఆర్య’ సినిమాకు నేటితో 17 ఏళ్లు

అల్లు అర్జున్ కెరీర్‌‌ను మలుపు తిప్పిన సినిమా ‘ఆర్య’. 2004, మే 7న విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సుకుమార్ అనే కొత్త దర్శకుడిని తెలుగు తెరకు పరిచయం చేస్తూ ముక్కోణపు ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కింది. టాలీవుడ్‌లో ఈ సినిమా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మూవీలో అను మెహతా హీరోయిన్‌గా నటించగా.. శివ బాలాజీ మరో కీలక పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమాకి సంగీతం అందించిన దేవీ శ్రీ పాటలు ఇప్పటికీ సంచలనమే.

నేటితో ఈ సినిమా 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆ జ్ఞాపకాలను తలుచుకుంటూ బన్నీ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ‘ఆర్య.. తన జీవితంలో మార్పు తీసుకొచ్చిన సినిమా అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. తన జీవితంలో జరిగిన అతిపెద్ద మిరాకిల్ అని.. ‘ఫీల్ మై లవ్’ లాంటి గోల్డెన్ మాటల తరువాతే అభిమానులు తనను ప్రేమించడం ప్రారంభించారని గుర్తుచేశాడు. ప్రస్తుతం బన్నీ ఇదే దర్శకుడితో ‘పుష్ప’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement