Friday, April 26, 2024

‘రాధే’ మొదటి రోజు కలెక్షన్స్ కరోనా సేవకులకు

ప్రభుదేవా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో రిలీజ్ కాబోతున్న చిత్రం రాధే. ఈ సినిమాను థియేటర్స్ తో పాటు పే పర్ వ్యూ పద్దతిలో ఓటిటిలో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా ద్వారా వచ్చిన మొదటి రోజు వసూళ్లను కరోనా సేవకులు, బాధితుల సహాయార్థం విరాళం ఇవ్వనున్నారట.

సల్మాన్ లాంటి స్టార్ హీరో సినిమా కావడంతో తొలి రోజు కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు విశ్లేషకులు. ఎలా లేదన్న 25 కోట్ల వరకూ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆ వచ్చిన మొత్తాన్ని కరోనా సేవకుల సహాయార్థం విరాళం గా ఇవ్వనున్నారట. ఇక ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డీజే సినిమా లోని సిటిమార్ సాంగ్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి హైప్ ను క్రియేట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement