Saturday, May 4, 2024

డ్రగ్స్ కేసులో త్వరలో కోర్టుకెళ్తా.. పిల్లల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలేంటి?

రాష్ట్రంలో జరుగుతున్న మాదకద్రవ్య వ్యాపారాలపై 2017లోనే హైకోర్టులో పిటిషన్ వేశానని, డ్రగ్స్ మాఫియాపై స్వచ్ఛంద సంస్థలతో ఎంక్వైరీ చేయించాలని కోరానని రేవంత్ రెడ్డి వెల్లడించారు. 2017లో సినిమా సెలబ్రిటీలు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న తర్వాతే కేటీఆర్‌కు సినిమా వాళ్ళు దగ్గరయ్యారని, అంతకు ముందు వాళ్లెవరూ ఆయనకు పరిచయం లేరని చెప్పుకొచ్చారు. ఆ కేసును అడ్డం పెట్టుకుని కేటీఆర్ సినిమా జనంతో సన్నిహితంగా ఉంటున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో 24 గంటలు మద్యం, పబ్బులు నడుపుకోమని పర్మిషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వమేనన్న ఆయన, పబ్‌లో దొరికిన వారిపై ఎందుకు వైద్య పరీక్షలు నిర్వహించలేదని ప్రశ్నించారు. ఈ అంశంపై త్వరలో కోర్టుకి వెళ్తామని, గతంలోనే డ్రగ్స్ కేసులో దొరికిన మొబైల్ ఫోన్స్, లాప్‌టాప్స్, వీడియో క్లిప్స్ సీజ్ చేయాలని హైకోర్టు తీర్పిచ్చిందని గుర్తు చేశారు.

పేర్లు బయటకు వచ్చిన తన బంధువుల నమూనాలను ఇప్పిస్తానని, అసలు డ్రగ్స్ తీసుకున్న వారిని వదిలి పెట్టి, మా పిల్లలపై ఆరోపణలు చేయడమేంటని రేవంత్ నిలదీశారు. చిన్నపిల్లలను అడ్డం పెట్టుకుని తనపై శిఖండి రాజకీయాలు చేయకండని హితవు పలికారు. మా పిల్లల్ని తీసుకొచ్చి టెస్ట్ చేయిస్తాను, దమ్ముంటే నీ కొడుకు నమూనాలు ఇప్పిస్తావా అని రేవంత్ కేటీఆర్‌కు సవాల్ విసిరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement