Saturday, May 4, 2024

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి ప్ర‌పోజ్ చేసిన అమ్మాయి-హ‌గ్ చేసుకున్న హీరో

హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్నాడు. కాగా బెంగళూరు అమ్మాయి విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి రింగు తొడిగి మ‌రీ ప్రపోజ్ చేసింది. ఆమె ప్రపోజ్ చేసిన తీరు పట్ల విజయ్ కూడా మెస్మరైజ్ అయ్యారు. సహృదయంతో స్పందించారు. ఆమెను దగ్గరికి తీసుకుని హగ్ చేసుకున్నాడు. అప్పటికే ఆశ్చర్యం తట్టుకోలేక ఏడుస్తున్న ఆ అమ్మాయిని ఓదార్చారు. అంతేకాదు, లైగర్ ప్రమోషన్లు పూర్తయ్యేదాకా ఆమె తన వేలికి తొడిగిన రింగ్ ను తీయనని మాటిచ్చారు విజయ్ దేవరకొండ. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్ కొత్త చిత్రం లైగర్ ప్రమోషన్స్ కోసం బెంగళూరు వెళ్లగా,.. అక్కడ ఎవరూ ఊహించని, అనుకోసి సంఘటన చోటు చేసుకుంది. తేజు అనే అమ్మాయి విజయ్ దేవరకోండను చూసి పులకించిపోయింది. తను ప్రాణంగా ప్రేమించిన హీరోను ఎదురుగా చూసి.. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోయింది. అంతేకాదు, దిష్టి తగలకుండా అప్పటికప్పుడు ఓ ఉంగరం తొడిగి తన ప్రేమను వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement