Sunday, April 28, 2024

మరిన్ని ఈవీ కార్లను తీసుకురానున్న హ్యుండాయ్‌

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ హ్యుండాయ్‌ మరిన్ని విద్యుత్‌ వాహనాలను మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఈ కంపెనీ ప్రధానంగా హ్యుండాయ్‌, కియా బ్రాండ్స్‌తో వీటిని తీసుకురానుంది. హ్యుండాయ్‌ కంపెనీ రానున్న 10 సంవత్సరాల్లో 20,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది. చెన్నయ్‌లోకి కంపెనీ ప్లాంట్‌ను ఆధునీకరించడం, ఉత్పత్తిన మరింతగా పెంచడం, కొత్త మోడల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకు వచ్చేందుకు ఈ పెట్టుబడి పెట్టాలని కంపెనీ భావిస్తోంది.

అత్యాధునిక విద్యుత్‌ కార్లను తీసుకురావాలని కంపెనీ నిర్ణయించింది. ఈ క్రమంలోనే కంపెనీ పలు విద్యుత్‌ కార్లను మార్కెట్‌లో ప్రవేశపెట్టనుంది. 2028 నాటికి ఇండియన్‌ మార్కెట్‌లో హ్యుండాయ్‌ 6 కంటే ఎక్కువ మోడల్స్‌ను తీసుకు వచ్చేందుకు 4000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనుంది. ఇందులో ఈ సంవత్సరం అయోనిక్‌ 5 మోడల్‌ విద్యుత్‌ కారు ఈ సంవత్సరమే రోడ్లపైకి రానుంది. హ్యుండాయ్‌ ప్రస్తుతం కోనా పేరుతో విద్యుత్‌ కారును విక్రయిస్తోంది. కంపెనీ చెన్నయ్‌ ప్లాంట్‌ నుంచే కొత్త ఈవీ కార్లు తయారవుతాయని కంపెనీ వెల్లడించింది. ఇందుకు అవసరమైన ఆధునీకరణ కొనసాగుతున్నదని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement