Tuesday, April 30, 2024

Crime: గోవాలో హాష్​ ఆయిల్​తో పట్టుబడ్డ హైదరాబాద్​ వాసి.. అరెస్టు చేసిన పోలీసులు

హాష్​ ఆయిల్​ కలిగి ఉన్న హైదరాబాద్​కు చెందిన వ్యక్తి గోవాలో పట్టుబడ్డాడు. అంతర్జాతీయ మార్కెట్​లో రూ.7.40లక్షల విలువ చేసే 740 గ్రాముల హాష్​ ఆయిల్‌ను అతని వద్ద నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ANC) శోభిత్ సక్సేన్ ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది. నిందితుడిని పృధ్వీ పెన్మత్స (25)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తర గోవాలోని పోర్వోరిమ్‌లో జరిగిన దాడిలో నిందితుడిని పట్టుకున్నామని ఎస్​పీ శోభిత్​ సక్సేన్​ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement