Friday, May 3, 2024

మాపెల్స్‌ రియల్‌ వ్యూ ను విడుదల చేసిన మ్యాప్‌ మై ఇండియా

భారతదేశంలో సుప్రసిద్ధ అడ్వాన్స్‌డ్‌ డిజిటల్‌ మ్యాప్స్ అండ్ డీప్‌ టెక్‌ ప్రొడక్ట్స్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్స్‌ కంపెనీ మ్యాప్‌ మై ఇండియా ఇప్పుడు ప్రజల కోసం మాపెల్స్‌ రియల్‌ వ్యూ ను విడుదల చేసినట్లు వెల్లడించింది. భారతదేశపు మొట్టమొదటి, పూర్తి దేశీయ ఆల్‌ ఇండియా 360 డిగ్రీ పనోరమిక్‌ స్ట్రీట్‌ వ్యూ, 3ఈ మెటావర్శ్‌ మ్యాప్‌ సేవలను భారతదేశపు సొంత, ఉచిత మ్యాపింగ్‌ పోర్టల్‌ మాపెల్స్‌ డాట్‌ కామ్‌ పై వీక్షించవచ్చు. ఈ సందర్భంగా మ్యాప్‌మై ఇండియా సీఈవో అండ్ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రోహన్‌ వర్మ మాట్లాడుతూ… మాపెల్స్‌ రియల్‌ వ్యూ ఇప్పుడు https://www.mappls.com, మాపెల్స్‌ యాప్‌పై లభ్యమవుతుందన్నారు. వినియోగదారులు వర్ట్యువల్‌గా భారతదేశాన్ని గతంలో ఎన్నడూ చూడని రీతిలో అన్వేషించడంతో పాటుగా వీధుల అందాలు, రోడ్లు, పలు పర్యాటక ప్రాంతాలు, గృహ, వాణిజ్య ప్రాంతాలు , హైవేలను వీక్షించవచ్చని తెలిపారు. విదేశీ మ్యాప్‌ యాప్‌లకు భిన్నంగా దేశీయ ప్రత్యామ్నాయం అందిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement