Monday, May 6, 2024

HYD : నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం..

నగరంలో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వాతావరనం చల్లబడి కుండపోతగా వర్షం కురిసింది. కూకట్​పల్లి, కేపీహెచ్​బీ కాలనీ, ఆల్విన్​కాలనీ, ప్రగతినగర్​, బంజారాహిల్స్​, జూబ్లిహిల్స్, పంజాగుట్ట, సికింద్రాబాద్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి తోపాటు ప‌లు ప్రాంతాల్లో మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షం కురుస్తోంది. ప‌లు చోట్ల ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ రోడ్లపై మ్యాన్​హోల్స్​ పొంగిపొర్లుతున్నాయి. నగరంలోని పలు ప్రధాప కూడలల్లో ట్రాఫిక్ స్థంభించడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement