Tuesday, May 7, 2024

భారీగా తగ్గిన బంగారం ధరలు

గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు భారీ స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. ఇక తాజా ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.350 తగ్గి రూ.45,740కి చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.410 తగ్గి రూ.49,890కి చేరిది.

మరోవైపు బంగారం ధర తగ్గినప్పటికీ వెండి ధరలలో మాత్రం ఎలాంటి మార్పు సంభవించలేదు. వెండి ధర స్థిరంగా ఉంది. కిలో వెండి ధర 77 వేల 300 రూపాయల వద్ద నిలకడగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement