Saturday, April 27, 2024

SRH vs KKR | రస్సెల్ సిక్సుల మోత.. హైదరాబాద్ ముందు భారీ టార్గెట్

ఐపీఎల్ 2024లో భాగంగా కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. మ్యాచ్ ప్రారంభం ఓవర్లలో ఫిలిప్ సాల్ట్ చలరేగి ఆడగా.. ఆఖరి ఓవర్లలో రస్సెల్ సిక్సర్లు, ఫోర్లతో విజృంభించాడు. దీంతో కోల్‌కతా స్కోరు భారీగా నమోదైంది.

ఫిలిప్ సాల్ట్ (54), ఆడ్రీ రస్సెల్ 64 (నాటౌట్) చరో హాఫ్ సెంచరీతో సాధించారు. ఇక, రమణదీప్ సింగ్ (35), రింకూ సింగ్ (23) పరుగులతో ఆకట్టుకున్నారు. హైదరాబాద్ బౌలర్లలో పాట్ కమిన్స్ ఒక వికెట్ తీయగా.. మయాంక్ మార్కండే రెండు, టి నటరాజన్ మూడు వికెట్లు దక్కించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement