Saturday, April 27, 2024

ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ డీల్‌తో భారీగా ఉద్యోగాలు

అమెరికాకు చెందిన విమానాల తయారీ సంస్థ బోయింగ్‌, ఎయిర్‌ ఇండియా మధ్య కుదిరిన ఒప్పందం భారీగా ఉద్యోగాలు సృష్టించనుంది. ప్రధానంగా అమెరికాలో 44 రాష్ట్ర్‌ాల్లో 10 లక్షలకుపైగా ఉద్యోగాలు అభించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చెప్పారు. భారత్‌, అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో చెప్పారు. టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్‌ ఇండియా 470 విమానాల కొనుగోలు చేయాలని నిర్ణయించింది. 250 విమానాలను ఎయిర్‌బస్‌ నుంచి 220 విమానాలను బోయింగ్‌ నుంచి కొనుగోలు చేయనుంది. మొత్తం ఈ విమానాల కొనుగోలు విలువ 45.9 బిలియన్‌ డాలర్లు.

- Advertisement -

ఈ డీల్‌ సందర్భంగా ప్రధాన మంత్రి మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వర్చువల్‌గా సంభాషించుకున్నారు. అమెరికా కంపెనీ బోయింగ్‌కు ఎయిర్‌ ఇండియా ఇచ్చిన ఆర్డర్‌ విలువ పరంగా మూడో అతి పెద్దది, విమానాల సంఖ్య పరంగా రెండో అతి పెద్దది. ఎయిర్‌బస్‌, బోయింగ్‌ సంస్థలతో భారీ స్థాయిలో విమానాల కొనుగోలుకు టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్‌ ఇండియా ఆర్డర్‌ ఇవ్వడం పట్ల అమెరికా, ప్రాన్స్‌ అధ్యక్షుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందాన్ని వారు స్వాగతించారు. ఈ ఒప్పందాల వల్ల ద్వైపాక్షి సంబంధాలు మరింత బలపడతాయని వారు అభిప్రాయపడ్డారు. తమ దేశాల్లో భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతుందని రెండు దేశాల అధ్యక్షులు చెప్పారు.

రోల్స్‌ రాయిస్‌- ఎయిర్‌ ఇండియా మధ్య జరిగిన ఇంజిన్ల కొనుగోలు ఒప్పందంపై బ్రిటన్‌ ప్రధాన మంత్రి రుషి సునాక్‌ స్పందిస్తూ యూకేలో అభివృద్ధి చెందుతున్న వైమానిక రంగానికి అకాశమే హద్దు అని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం వల్ల యూకేలో మంచి వేతనాలతో కూడిన ఉద్యోగాలను సృష్టిస్తుందని చెప్పారు. డెర్బే నుంచి వేల్స్‌ వరకు సరికొత్త తయారీ హబ్‌లను ఏర్పాటుకు చేసేందుకు వీలు కలుగుతుంన్నారు. ఎయిర్‌ ఇండియా భారీగా విమానాల కొనుగోలు కోసం రెండు కంపెనీలతో నెలల తరబడి రహస్యంగా మంతనాలు జరిపింది. అన్ని అంశాలపై తుది నిర్ణయం తీసుకున్న తరువాతే ఒప్పందాన్ని ఖరారు చేసింది. గత సంవత్సరం వేసవి నుంచే దీనిపై ఎయిర్‌ ఇండియాకు చెందిన ఉన్నతస్థాయి అధికారులు విమాన తయారీ సంస్థలో చర్చలు జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement