Sunday, April 28, 2024

China: స్కూల్ హాస్టల్‌లో భారీ అగ్నిప్రమాదం.. 13 మంది మృతి

చైనాలో భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. హెనాన్ ప్రావిన్స్‌లోని ఓ స్కూల్ హాస్టల్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 13 మంది మరణించారు. కాగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

హెనాన్‌లోని యన్‌షాన్‌పు గ్రామంలోని యింగ్‌కై స్కూల్‌లో అర్థ‌రాత్రి మంటలు రావడంతో స్థానికులు అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకిని మంటలను ఆర్పివేసినట్లు తెలిపింది. అయితే, ఈ ప్రమాదంలో దాదాపు 13 మంది మరణించినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. అలాగే, ఈ సంఘటనకు సంబంధించిన కేసులో పాఠశాల హెడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement