Thursday, February 8, 2024

Editorial: పేదల జీవితాల్లో రామజ్యోతి!

ఎన్నో దశాబ్దాల కల సాకారమవుతున్న వేళ భారత్‌ ఒక గొప్ప ప్రతిన తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపు ఇచ్చారు. దేశంలో పేదరికం లేకుండా చేస్తామని దేశంలో అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా భాగ్యవంతులు ఈ ప్రతిన తీసుకోవాలని ఆయన సూచించారు.

- Advertisement -
   

ప్రభుత్వం నుంచి పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారంతా పేదవర్గాలేననీ, ఇంకా పేదరికంలో మగ్గుతున్న వారిని ఆదుకోవడానికి ఇతర వర్గాలు కృషి చేయాలని ఆయన సూచించారు.రామాల యంలో సీతారామ విగ్రహాల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నాడు దేశ వ్యాప్తంగా ప్రజలంతా తమ ఇళ్ళల్లో రామ జ్యోతిని వెలిగించాలని ఆయన మరోసారి సూచించారు. రామరాజ్యంలో ప్రజలంతా ఆకలిదప్పులు లేకుండా సుఖశాంతులతో జీవించారనీ, మళ్ళీ అలాంటి పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారనీ, ప్రజాస్వామ్యం లో ప్రజల భాగస్వామ్యంతోనే అది సాధ్యమని ఆయన అన్నారు. రామాలయ ప్రారంభోత్సవానికి ముందే మోడీలో నిత్య అనుష్టానంతో, రామధ్యానంతో దేశాధి నేతగా రామరాజ్యం కోసం తపిస్తున్నారు.

తనతో పాటు రామధ్యానంలో ప్రజలందరినీ భాగస్వాములుగా చేయాలన్న ఆయన ఆకాంక్షను నెరవేర్చేందుకు దేశ ప్రజలు ఈ సందర్భాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సీతారాముల విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో అయినా, ఇప్పటికే దేశం లోని అన్ని ప్రాంతాల ప్రజల్లో రామభక్తి ఆవహించింది. పట్టణాలు, పల్లెలు, నగరాల్లో ఎక్కడ చూసినా రామాల యం గురించే చర్చ జరుగుతోంది. ఇది రామాలయాన్ని ప్రారంభిస్తున్న మోడీ అదృష్టమే కాదు. రామాలయ ప్రారంభోత్సవ కాలంలో జీవించడం తమ అదృష్టంగా ప్రజలు భావిస్తున్నారు. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి సంబంధించి పాత చరిత్రను అలా ఉంచితే, గడిచిన మూడున్నర దశాబ్దాలు చరిత్రన తెరచి చూస్తే ఎక్కడ వ్యతిరేకత వస్తుందేమోనన్న బెదురు, భయం ప్రజల్లో లేకపోలేదు. అయితే, సర్వోన్నత న్యాయస్థానం ద్వారా ఈ వివాదానికి శాశ్వత పరిష్కారాన్ని కనుగొన డం ముమ్మాటికీ ఘన విజయమే.

రామాలయ ప్రారం భోత్సవ శుభ సమయం కోసం ఎదురు చూస్తున్నది హిందువులే కాదు, ఇతర వర్గాలూనూ. అలాగే, రామాల య నిర్మాణమనే బృహత్తర యజ్ఞంలో కులాలు, మతా లు, వర్గాలు అనే తేడా లేకుండా అందరూ పాల్గొంటున్నా రు. శ్రీరాముడి తిరుముల తిరుపతి దేవస్థానం వారు లక్ష లడ్డూలు తయారు చేసి పంపడం ద్వారా ఆదర్శంగా నిలి చాయి. ఆ తర్వాత దేశంలో అన్ని సంస్థలు, వ్యక్తులు ముందుకు వచ్చి తమ సాయాన్ని అందిస్తున్న పరిస్థితిని చూస్తుంటే, గ్రామాల్లో సీతారామ కల్యాణానికి అన్ని వర్గాలూఏ విధంగా అయితే, సమధికోత్సాహంతో ముందుకు వస్తారో ఆ సన్నివేశాలు గుర్తుకు వస్తున్నాయి. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు. ప్రభుత్వం పర్యవేక్షణ లో సాగుతున్న కార్యక్రమం. ప్రపంచంలో అతి పెద్ద రామాలయాన్ని నిర్మించుకోవడంలో భారత ప్రజలం తా పాలు పంచుకుంటున్నారు. శిలాన్యాస్‌ ట్రస్టు వారు పిలుపు ఇచ్చిన వెంటనే విరాళాలు ఇచ్చిన వదాన్యులం తా ఈ మహా ఆలయ నిర్మాణంలో భాగస్వాములే. రాముడు భారతీయులకే కాదు, ఇండోనేషియా తదితర దేశాల్లో ప్రజలందరికీ ఆరాధ్యుడే. ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో రామాలయం ఆకృతి అయోధ్య ఆలయం ఆకృతి ని పోలి ఉంది.

ఇంకా ఇతర దేశాల్లో కూడా ఈ మాదిరి ఆలయాలు వెలుస్తాయి. అలాగే, దేశంలోని వివిధ ప్రాం తాల్లో రామాలయాలు భారీ ఎత్తున నిర్మాణం జరిగే అవ కాశం ఉంది. ప్రధానమంత్రి పేర్కొన్నట్టు దేశ ప్రజల్లో సామరస్యం, పరస్పర సహకారం, సమధర్మం వ్యాప్తికి రామజ్యోతి కార్యక్రమం దోహదం చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. రామ శబ్దం వినగానే ప్రజ ల్లో భావోద్వేగం పొంగులు వారుతుంది. అయోధ్యలోనే కాదు, ప్రతి ఇంట్లోనూ రాముడు ప్రతిష్ఠితమై ఉన్నాడని చాటి చెప్పడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశ్యం. ఇది విజయవంతం అవుతుందనడంలో ఎటువంటి సందే హం లేదు. రామజ్యోతులు వెలగడమే కాదు, ప్రతిపౌరు ని హృది రామజ్యోతి అవుతుంది. రామాలయాన్ని నిర్మించుకోవడంలో భారత ప్రజలు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు దేశంలో అన్ని ప్రాంతాల్లో రామాలయం ప్రారంభోత్సవ సన్నాహాల విశేషాలే అందరినోట వినిపిస్తున్నాయి. తమ ఇంట్లో జరిగే శుభకార్యంగా భావిస్తూ అందరు ఈ విశేషాలే చెప్పుకుంటున్నారు. తమ ఇళ్లల్లో రోజువారీ ప్రార్థనలు, పూజలు అన్నీ రామభక్తిని చాటుకునే రీతిలోనే జరుపు కుంటున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల ప్రవాస భారతీయులు రామాలయం ప్రారంభోత్స విశేషాలను వార్తా ప్రసార సాధనాల ద్వారా వీక్షించేందుకు ఎదురు చూస్తున్నారు. అయోధ్యకు వెళ్లకపోయినా అక్కడి కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించేందుకు అతృతతో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement